
నదిలో మునిగి వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని ఏల్‌ఏ సాగరం బీడీ కాలనీ సమీపంలో ఓ వ్యక్తి స్వర్ణముఖి నదిలో మునిగిపోయి మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది.వివరాలు.. కాలనీకి చెందిన కుదిరి ఉదయ్‌కుమార్ (35) సోమవారం సాయంత్రం స్నానం చేసేందుకు నదికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నది ఒడ్డున ఉదయ్‌కుమార్ దుస్తులను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపకశాఖ అధికారుల సాయంతో నదిలోని గుంతలో కూరుకుపోయిన ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పచ్చమూక దర్జా..
ప్రభుత్వ భూముల కబ్జా!
బాలాయపల్లి(సైదాపురం) : బాలాయపల్లె మండలంలోని గొల్లగుంట చెరువు పొరంబోకు, చిలమనూరు పంచాయతీ గల్లగుంట వద్ద అటవీశాఖ భూములను టీడీపీ నేతలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణకు అటవీశాఖ అధికారులే సాయం చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. వెంకటగిరి– నాయుడుపేట రహదారి సమీపంలోని ఈ భూములపై పచ్చమూక కన్ను పడింది. వెంటనే ఆ భూములను చదును చేసేసింది. దీనిపై గ్రామస్తులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.సుమారు 20 ఎకరాల అటవీ భూమిని కబళించినా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ క్రమలంఓనే ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఆక్రమిత భూమికి పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

నదిలో మునిగి వ్యక్తి మృతి

నదిలో మునిగి వ్యక్తి మృతి