
శిక్షణకు హాజరుకావాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీకి ఎంపికైన నూతన టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాల్సిందేనని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఈ మేరకు సోమ వారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీలో ఎంపికై న నూతన టీచర్లకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు అక్టోబర్ 3 ఉదయం 7 గంటలకు తమకు కేటాయించిన శిక్షణ కేందాల్లో హాజరుకావాలన్నారు. ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. శిక్షణ రోజుల్లో వంద శాతం హాజరు తప్పనిసరి అని చెప్పారు. ప్రతి అభ్యర్థి లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్, అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను తీసుకురావాలని తెలిపారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్వీ ఫార్మసీ (ఆర్వీఎస్ నగర్, చిత్తూరు), ఆర్‌కే పాఠశాల (కట్టమంచి, చిత్తూరు), ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ (చిగురువాడ, తిరుపతి), విశ్వం స్కూల్ (జీవకోన, తిరుపతి), మెడ్జీ స్కూల్ (తిరుపతి), ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల (బైపాస్‌రోడ్డు, గూడూరు)లో శిక్షణ ఉంటుందని డీఈఓ వెల్లడించారు.