
బుచ్చినాయుడు కండ్రిగలో వైద్య సేవలు బంద్
బుచ్చినాయుడుకండ్రిగ: స్థానిక పీహెచ్‌సీలో సోమ వారం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రభుత్వ వైద్యులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేశారు. వైద్యులు మురళీధర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ సమ్మెలో కి వెళ్లడంతో ఓపీ సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ సర్వీసు కోటాను పునరుద్ధరించాలని, టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబర్ అలవెన్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ.5 వేలు అలవెన్స్ ఇవ్వాలని, నేటివిటీ, అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీహెచ్‌సీ వైద్యులకు కచ్చితమైన పని గంటలు, స్థిరమైన వారాంతపు సెలవులు ఇవ్వాలని, వైద్యులకు జాబ్ చార్ట్ ఇవ్వాలని తెలిపారు. వైద్యులకు పదోన్నతులు కల్పించాలన్నారు. వైద్యల సమస్యలను పరిష్కరించకుంటు దశల వారీగా అత్యవసర సేవలను కూడా ఆపేస్తామని హెచ్చిరించారు.
వైద్యం అందలేదు
గాజులపెళ్లూరు గ్రామానికి చెందిన నేను అనారోగ్య సమస్యతో వైద్యం కోసం బుచ్చినాయుడుకండ్రిగలోని ప్రాథమిక కేంద్రానికి సోమవారం వచ్చాను. అయితే వైద్యులు సమ్మెలో ఉన్న కారణంగా వారు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో నాకు వైద్యం అందలేదు. ఉన్న నర్సులతో నామమాత్రపు వైద్యం చేయించుకుని ప్రైవేటు వైద్యం కోసం బయటకు వెళ్లాను. పేద ప్రజలకు వైద్యం అందించే వైద్యుల సమస్యలపై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్టు కాదు. –రమణయ్య, గాజులపెళ్లూరు

బుచ్చినాయుడు కండ్రిగలో వైద్య సేవలు బంద్