
సమాజాన్ని మార్చింది జాషువా సాహిత్యమే
తిరుపతి సిటీ: తెలుగు కవిత్వంతో సమాజంలో మార్పు తెచ్చి, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చిన మహాకవి, సంఘ సంస్కర్త గుర్రం జాషువా అని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు రాపూర్‌ప్రసాద్‌బాబు కొనియాడారు. స్థానిక గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతిని జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ జనసై న్యం వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాకర్ మాదిగ, జో రేపల్లి కాటయ్య, ప్రభు, అర్జున్, నరేష్ పాల్గొన్నారు.