
బాలకృష్ణ వ్యాఖ్యలపై నిరసన
తిరుపతి మంగళం : జేబులో మెంటల్ సర్టిఫికెట్ పెట్టుకుని అభిమానులు, పార్టీ వాళ్లు అన్న తేడా లేకుండా చెంపలు పగలగొట్టే బాలకృష్ణ ఒక పెద్ద సైకో అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన చిరంజీవిని సత్కరించి సినీ పెద్దలను గౌరవించిన గొప్ప మనసున్న నేత మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం పార్టీ నాయకులు బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వందల మంది పోలీసులు మోహరించి నిరసనను అడ్డుకుని ఫ్లెక్సీలను లాగేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తన సెక్యూరిటీపై కాల్పులు జరిపిన బాలకృష్ణను నందమూరి తారక రామారావును చూసి కాపాడిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తు చేశారు. స్వయాన తన బావ బాలకృష్ణకు మతిస్థిమితం లేదని తాను రచించిన ఓ పుస్తకంలో చెప్పారన్నారు. అఖండ సినిమాపై జగనన్నను బాలకృష్ణ కలవాలంటే అంతపెద్ద మనిషి మన దగ్గరికి రావడం ఏమిటని, అతను ఏమి అడిగితే అది చేసేయండని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానికి చెప్పిన గొప్ప గుణం జగనన్నదన్నారు. అలాంటి నాయకుడిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం అతడి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తుడా వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, లవ్లీ వెంకటేష్, తలారి రాజేంద్ర, కార్పొరేటర్ అనీష్‌రాయల్, పార్టీ యువజన విభాగం నాయకులు ఉదయ్ వంశీ, మల్లం రవికుమార్, దినేష్‌రాయల్, మద్దాలిశేఖర్, పసుపులేటి సురేష్, రామకృష్ణారెడ్డి, శాంతారెడ్డి, పునీత, పుష్పలత పాల్గొన్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై నిరసన