● విశేష విహారం | - | Sakshi
Sakshi News home page

● విశేష విహారం

Sep 25 2025 7:01 AM | Updated on Sep 25 2025 7:01 AM

● విశ

● విశేష విహారం

● విశేష విహారం ● అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ● శాస్త్రోక్తంగా ధ్వజారోహణం ● కనులపండువగా పెదశేష వాహన సేవ ● పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● అక్టోబర్‌ 1 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న సచివాలయ ఉద్యోగులు ● ఇప్పటికే అధికారులకు అందిన నోటీసులు ● 30లోపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

సర్వేల పేరుతో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న నేపథ్యంలో పలు అవమానాల పాలవుతున్నాం. దీంతో ఆత్మగౌరవం కోల్పోతున్నాం. సర్వేల నుంచి విముక్తి కల్పించాలి.

తమ విద్యార్హతల ఆధారంగా విధులు అప్పగించాలి.

ఇతర శాఖల్లో కాకుండా మాతృశాఖలోనే పని చేసే అవకాశం కల్పించాలి.

విధులనిర్వహణకు సమయపాలన కేటా యించాలి.

సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధుల భారం నుంచి తప్పించాలి.

6 ఏళ్లు ఒకే క్యాడర్లో సర్వీస్‌ చేసిన ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

ప్రొబేషనరీ సమయంలో రావాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన ప్రైమ్‌ టైమ్‌ నిర్ణయించాలి.

సచివాలయాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి.

సర్వేలను సంబంధిత విభాగాలకు కేటాయించాలి.

సచివాలయాల్లోని రికార్డు అసిస్టెంట్లను

జేఎల్‌గా మార్పు చేయాలి.

సీనియారిటీ ప్రకారం పారదర్శకంగా బదిలీ ప్రక్రియ చేపట్టాలి.

ధ్వజపటం ఊరేగింపులో జీయర్‌స్వాములు, టీటీడీ ఈఓ

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని వైభవంతో తిరుగిరులు విరాజిల్లుతున్నాయి. బ్రహ్మోత్సవ శోభతో దేదీప్యంగా కాంతులీనుతున్నాయి. ధ్వజ పటం తేజస్సుతో నూతన వెలుగులను సంతరించుకున్నాయి. గోవిందనామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏడు పడగల పెదశేషునిపై విహరిస్తున్న వైకుంఠనాథుని వీక్షించి భక్తజనులు పరవశించారు. ఉభయ దేవేరీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. మహిమాన్విత మనోహరమూర్తిని కాంచిన కనులదే భాగ్యమంటూ పులకించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. ఏడుకొండలస్వామివారిని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ భక్తిశ్రద్ధలతో సేవించుకున్నారు. – తిరుమల

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అక్కసుతో కూటమి సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. గ్రామ స్వరాజ్య సాధనను నీరుగారుస్తోంది. ప్రతిష్టాత్మక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. అర్థం పర్థం లేని సర్వేలతో వేధిస్తోంది. ప్రజా సేవలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా సిబ్బందిని వినియోగించుకుంటోంది. చిన్నపాటి పొరబాట్లకు సైతం మెమోలు జారీ చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఖరిపై సచివాలయ ఉద్యోగులు రగిలిపోతున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడంపై మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు నోటీసులు సైతం సంబంధిత అధికారులకు అందజేశారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు(ఫైల్‌)

జిల్లా సమాచారం

గత ప్రభుత్వంలో సచివాలయాలు 691

ఉద్యోగులు 5,625 మంది

కూటమి సర్కారులో సచివాలయాలు 353

ఉద్యోగులు 3,650

వివిధ విభాగాలకు కేటాయించినవారు 1,975

తిరుపతి అర్బన్‌ : ప్రజలకు సత్వర.. సులభతర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్‌ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి నాడు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, నగరపాలక కమిషనర్లకు సమ్మె నోటీసులను అందజేశారు. తమపై పనిభారం తగ్గించాలని, న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు. చిన్న పొరబాట్లకు మెమో జారీ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఆగస్ట్‌లో హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీకి రాలేదంటూ 281 మందికి మెమోలు జారీ చేయడం సరికాదని నిలదీస్తున్నారు. గతంలో వలంటీర్లు చేసిన అన్ని పనులను తమ చేత చేయించడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సందర్భంగా ఇచ్చిన దరఖాస్తులను పూర్తి చేయడం తలపోటుగా మారిందంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు

● విశేష విహారం 1
1/6

● విశేష విహారం

● విశేష విహారం 2
2/6

● విశేష విహారం

● విశేష విహారం 3
3/6

● విశేష విహారం

● విశేష విహారం 4
4/6

● విశేష విహారం

● విశేష విహారం 5
5/6

● విశేష విహారం

● విశేష విహారం 6
6/6

● విశేష విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement