
కొత్త గురువులకు కొలువులు
తిరుపతి సిటీ : ఇష్టారాజ్యంగా.. నిబంధనలను తుంగలోతొక్కి ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం డీఎస్సీ ప్రక్రియ నిర్వహించింది. ఈ మేరకు 1,500 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక నియామక పత్రాలు పంపిణీ చేసేందుకు మరో హంగామాకు తెరతీసింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపికై న అభ్యర్థులకు విజయవాడకులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా నియమాకపత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బుధవారం ప్రత్యేక బస్సుల్లో అభ్యర్థులను తరలించే ప్రక్రియ చేపట్టింది. ఇందుకోసం రెండు రోజుల నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికై న అభ్యర్థులకు జిల్లా అధికారులు ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా సమచారం అందించారు. ఖచ్చితంగా విజయవాడలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని హుకుం జారీ చేశారు.
50మంది గైర్హాజరు
మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఇప్పటికే పలు మార్లు జిల్లా అధికారులు పలు మార్లు నిబంధనలు విధించారు. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన విజయవాడుకు వెళ్లాలంటూ ప్రతి ఒక్క అభ్యర్థికి మెసేజ్‌లు పంపారు. కానీ ఆరోజు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కార్యక్రమం అధికారులు రద్ధు చేశారు. దీంతో అప్పటికే హాజరైన అభ్యర్థులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. దీంతో మరో మారు ఈనెల 25వ తేదీన సీఎం చేతుల మీదుగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. దీంతో అభ్యర్థులు తమ పనులను వదులుకుని డీఈఓ ఆదేశాల మేరకు రేణిగుంట రోడ్డులోని చదలవాడ కళాశాలకు హాజరయ్యారు. 50మంది అభ్యర్థులు తమ సొంత కారణాలతో హాజరు కాలేపోతున్నామంటూ డీఈఓకు విన్నవించారు.