
కల్యాణ వెంకన్న వైభవం
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టారు. శోభాయమానంగా అలంకరించిన దేవదేవేరులను పెదశేష వాహనంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు.. గోవిందనామస్మరణల నడుమ కనులపండువగా ఊరేగించారు. ఉభయదేవేరీ సమేతంగా విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కర్పూరహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాకాల మండలం నుంచి సారె తీసుకువచ్చిన భక్తులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. – తిరుపతి రూరల్

కల్యాణ వెంకన్న వైభవం

కల్యాణ వెంకన్న వైభవం

కల్యాణ వెంకన్న వైభవం