ఆత్మగౌరవం దెబ్బతింటోంది.. | - | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవం దెబ్బతింటోంది..

Sep 25 2025 7:01 AM | Updated on Sep 25 2025 7:01 AM

ఆత్మగ

ఆత్మగౌరవం దెబ్బతింటోంది..

మాకు అప్పగించిన బాధ్యతలను తప్పకుండా చేస్తాం. అయితే సంబంధం లేని సర్వేలను అంటగట్టడం, ఎరువుల విక్రయాల బాధ్యతలు ఇవ్వడం, పదేపదే మెమోలు జారీ చేయడం సరికాదు. దీంతో ఆత్మగౌరవం దెబ్బతింటోంది. పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకున్నాం. మాలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి న్యాయమైన పనులు అప్పగించాలి. లేదంటే సమ్మె బాట పట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం.

– తోటకూర కోటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు

సర్వే భారం తప్పించండి

పదుల సంఖ్యలో సర్వేలు ఇచ్చేస్తున్నారు. దీంతో ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేయడానికి సమయం సరిపోతుంది. మరోవైపు సచివాలయంలో మాకు అప్పగించి బాధ్యతలు సకాలం చేస్తున్నప్పటికీ భారం తప్పడం లేదు. అన్ని విభాగాలకు చెందిన సర్వేలను సచివాలయ ఉద్యోగులకే ఇచ్చేస్తున్నారు. దీంతో ఆయా విభాగాలకు చెందిన జిల్లా అధికారులు గడువులోపు సర్వే పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సర్వే ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోంది. ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. – పి.గీత, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు

వలంటీర్ల బాధ్యతలు ఇచ్చారు

గత ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ పనిచేసేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడం, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు తదితర కార్యక్రమాలను చేపట్టేవారు. అయితే వారిని తొలగించడంతో ఆ బాధ్యతలను పూర్తిగా సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ప్రధానంగా ఆర్థిక, విద్య, వైద్యం, ఆధార్‌, బయోమెట్రిక్‌ తదితర సర్వేలతో భారం పెరిగిపోయింది. దీంతో ఇబ్బంది పడుతున్నాం. అలాగే సీనియారిటీ మేరకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. – పి.పూర్ణచంద్రరావు, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులర్‌ సెక్రటరీ

న్యాయమైన కోర్కెల కోసమే..

మేము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. న్యాయమైన కోర్కెల కోస మే సమ్మె చేయాలని భావిస్తున్నాం. ఆ మేరకు ఇప్పటికే అధికారులుక సమ్మె సమాచారం ఇచ్చాం. మా సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం తప్పదు. ప్రతి పనీ సచివాలయ ఉద్యోగులకే అప్పగించ డం సరికాదు. పోటీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి ఈ ఉద్యో గం పొందాం. వలంటీర్లు చేసే పనులను సచివాలయ ఉద్యోగులపై రుద్దుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతోనే సమ్మె కు దిగాలని నిర్ణయించాం.– పి.నాగమోహన్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉద్యమం తప్పదు

సచివాలయ ఉద్యోగుల ఉద్యమం తప్పదని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా అడుగులు పడడం లేదు. ఈ నెల చివరికల్లా ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ చేపట్టేదుకు సన్నద్ధమవుతున్నాం. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. వాటిని మాత్రమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – వి.విద్యాసాగర్‌రెడ్డి,

తిరుపతి కార్పొరేషన్‌ వార్డు సెక్రటరీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు

నిరసన గళం వినిపిస్తాం

సచివాలయ ఉద్యోగుల నిరసన గళాన్ని అక్టోబర్‌ 1 నుంచి గట్టిగానే ప్రభుత్వానికి వినిపిస్తాం. 17 నెలలుగా ఎన్నో ఒత్తిళ్లను భరిస్తూనే ఉద్యోగాలు చేస్తున్నాం. అయినా మా సమస్యలకు పరిష్కారం లభించలేదు. మేము మనుషులమే, యంత్రాలం కాదు. మా శక్తి మించినట్టే పనిచేస్తున్నాం. అయినా అదనపు భారం మోపుతున్నారు. పని ఒత్తిడితో పలువురు ఉద్యోగులు అనారోగ్యం భారిన పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. లేదంటే సమ్మె తప్పదు. – ఎస్‌.హలీ అక్బర్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, జిల్లా కార్యదర్శి

ఆత్మగౌరవం దెబ్బతింటోంది.. 
1
1/5

ఆత్మగౌరవం దెబ్బతింటోంది..

ఆత్మగౌరవం దెబ్బతింటోంది.. 
2
2/5

ఆత్మగౌరవం దెబ్బతింటోంది..

ఆత్మగౌరవం దెబ్బతింటోంది.. 
3
3/5

ఆత్మగౌరవం దెబ్బతింటోంది..

ఆత్మగౌరవం దెబ్బతింటోంది.. 
4
4/5

ఆత్మగౌరవం దెబ్బతింటోంది..

ఆత్మగౌరవం దెబ్బతింటోంది.. 
5
5/5

ఆత్మగౌరవం దెబ్బతింటోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement