
కాంతులీనుతున్న కనకాచలం
దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని కనకాచలంపై వెలసిన దుర్గమ్మ ఆలయం విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ విగ్రహాన్ని పిట్లవారివీధి కృష్ణారెడ్డి మండపం వద్ద ఏర్పాటు చేయనున్నారు. దుర్గమ్మ కొండమీదికి వెళ్లలేని వాళ్లు కిందే అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. పిట్లవారివీధి వద్ద ఉన్న ఆర్చి దగ్గర నుంచి కనకాచలం పైన ఉన్న అమ్మవారి ఆలయం వరకు విద్యుత్ దీపాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. – శ్రీకాళహస్తి

కాంతులీనుతున్న కనకాచలం