
విజయవంతంగా ‘నవయుగ రన్’
తిరుపతి క్రైమ్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం తిరుపతిలో నవయుగ రన్ చేపట్టారు. ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజీ నుంచి బాలాజీ కాలనీ మీదుగా ఇందిరా మైదానం వరకు త్రీకే రన్ కొనసాగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ దేశ భవితకు కట్టుబడి యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని ఎంచుకోవాలని కోరారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైన డ్రగ్స్ విక్రయం, వినియోగం గురించి తెలిస్తే వెంటనే ఈగల్ సెల్ నంబర్ 1908కు కాల్ చేయాలన్నారు. నిరంతరం సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు.