
తర్పణం.. కిక్కిరిసిన ‘తీర్థం’
తర్పణాలు వదులుతున్న జనం
అత్యంత అరుదుగా ఆదివారం మహాలయ అమావాస్య రావడంతో పితృ తర్పణాల సమర్పణకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కపిలతీర్థంలో పిండ ప్రదానం చేసేందుకు భారీగా క్యూ కట్టారు. ఈ మేరకు కపిలేశ్వర బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం సభ్యులు శాస్త్రోక్తంగా ప్రక్రియ చేపట్టారు. వేకువజాము నుంచే సుమారు 200 మంది తర్పణ క్రతువుల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పితృ రుణం తీర్చుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు కపిలతీర్థం చేరుకున్నారు. పురోహితులు సైతం రూ.500 నుంచి రూ.5వేల వరకు ఇష్టారాజ్యంగా దక్షిణ వసూలు చేయడంతో పలువురు ఇబ్బందిపడ్డారు. అయితే జనవాహినికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు చేపట్టారు. – తిరుపతి కల్చరల్

తర్పణం.. కిక్కిరిసిన ‘తీర్థం’

తర్పణం.. కిక్కిరిసిన ‘తీర్థం’

తర్పణం.. కిక్కిరిసిన ‘తీర్థం’

తర్పణం.. కిక్కిరిసిన ‘తీర్థం’