
జెండాకు జేజేలు!
చిల్లకూరు : గూడూరు పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా జెండా ఉత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో పురవీధులు జనంతో కిక్కిరిశాయి.
ప్రత్యేక పూజలు
పట్టణంలోని బొడ్డు చౌకలో సాయంత్రం 6 గంటలకు ఆంజనేయస్వామి జెండాను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తూర్పువీధి, కోనేటిమిట్టతోపాటు పలు ప్రాంతాల్లో జెండా ఊరేగింపులు ప్రారంభించారు. ఒక్కో జెండా ప్రతిష్టకు రూ.లక్ష నుంచి రూ.35లక్షల వరకు వెచ్చించడం విశేషం.
అలరించిన భేతాళ నృత్యం
జెండా ఊరేగింపు సందర్భంగా కేరళ బృందాలతో వాయిద్యాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులను అలరించేలా భేతాళ నృత్యాలను చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పకడ్బందీగా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

జెండాకు జేజేలు!

జెండాకు జేజేలు!