
● స్వర్ణకాంతుల్లో కోవెల
జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీవేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయం స్వర్ణకాంతితో శోభాయమానంగా కనిపించింది. గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం అనంతరం సాయంత్రం 6.30 గంటలకు వేదనారాయణ స్వామి ఆలయ రాజగోపురం స్వర్ణకాంతులతో మిరుమిట్లు కొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఈ సుందర దృశ్యాన్ని ప్రజలు సన్నిధి వీధిలోని టవర్‌క్లాక్ కూడలిలో నిలుచుకుని వీక్షించారు. సూర్య కిరణాల వెలుగులో ఆలయ గోపురం కాంతులీనింది. దీనికితోడు ఆలయ గోపురంపై ఏర్పడిన ఇంద్రధనస్సు భక్తులను మైమరిపించింది. – నాగలాపురం