
చిట్టమూరులో..
చిట్టమూరు: మండలంలో 23 పంచాయతీల ఉండగా.. 3 రాజీవ్ టెక్నాలజీ పథకాలు, 56 పథకాల ద్వారా గ్రామ పంచాయతీలకు తాగునీరు సరఫరా అవుతుంది. అయితే చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లు శుభ్ర చేయడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్‌లో క్లోరినేషన్ చేయకపోవడంతో కలుషిత నీరే సరఫరా అవుతుంది. కొన్నిచోట్ల తాగునీటి పైపుల నుంచి నీరు లీకై కలుషితం అవుతోంది. మల్లాం గ్రామంలో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో శుభ్రం చేయకుండానే నీటిని సరఫరా చేస్తున్నారు. దరఖాస్తు గ్రామంలో తాగునీటి పథకానికి సంబంధించిన వాటర్ ట్యాంక్‌లో బోరు ద్వారా వచ్చే ఇసుక పేరుకుపోవడంతో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు.