
గని కార్మికుల భద్రతే లక్ష్యం
సైదాపురం: గని కార్మికుల భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ అడుగులు వేస్తోందని డిప్యూటీ మైన్స్ సేఫ్టీ నెల్లూరు రీజియన్ అధికారి పెద్దిరెడ్డి రఘుపతి వెల్లడించారు. మండలంలోని కలిచేడు గ్రామంలోని ఓకేషనల్ ట్రైనింగ్ కేంద్రంలో బుధవారం ఎలక్ట్రానిక్స్ డిటోనేటర్ వాడకంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గతంలో గనుల్లో ఎలక్ట్రికల్ డిటోనేటర్ అధికంగా వినియోగించేవారన్నారు. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రికల్ డిటోనేటర్‌కు స్వస్తి పలికి ఎలక్ట్రానిక్స్ డిటోనేటర్‌ను వినియోగంలోకి తీసుకువస్తారని తెలిపారు. తద్వారా కార్మికుల భద్రతతో పాటు యాజమాన్యానికి కూడా పూర్తిగా రక్షణ ఉంటుందన్నారు. ఎలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం లేదన్నారు. అందరు యాజమానులు ఇక నుంచి ఎలక్ట్రానిక్స్ డిటోనేటర్ ద్వారానే పనులను కొనసాగించాలన్నారు. అనంతరం వాడకంపై యాజమానులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీడీఎంఎస్ కిషోర్‌కుమార్, జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాసరావు, సౌత్ ఇండియన్ మైకా మైన్స్ అధ్యక్షుడు మాగుంట ద్వారకానాఽథరెడ్డి, వివివి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర, సురేష్‌రెడ్డి, ప్రణయ్‌కుమార్‌రెడ్డి, బీ సుబ్బారెడ్డి, రాధకృష్ణ మైన్ ఏజెంట్ వసంతరావు, వీటిఓ రవిశంకర్, మేనేజర్లు వాసు, విశ్వం, శేఖర్‌నాయుడు, ఇస్మాయిల్, రంగారెడ్డి, మురగేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.