
● వీఐపీలకే మా సేవ!
సామాన్య భక్తులకే ప్రాధాన్యమంటారు.. సులభతరంగా ముక్కంటి దర్శనం కల్పిస్తామంటారు.. చిన్నపాటి ఇబ్బంది కూడా తలెత్తకుండా సకల వసతులు కల్పిస్తామంటారు. అయితే ఆచరణలో మాత్రం తూతూమంత్రంగా అమలు చేస్తుంటారు. అదే వీఐపీలు వస్తున్నారంటే రెడ్‌కార్పెట్ పరిచేస్తారు. తోరణాలతో స్వాగతం పలుకుతారు. ప్రముఖుల సేవకు వైద్యసిబ్బందిని సిద్ధం చేస్తారు. వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఆదాయం ఆర్జించేందుకు అధికార పార్టీ కార్యకర్తలకు అనుమతులు మంజూరు చేస్తారు. దూరాభారం నుంచి వచ్చిన భక్తులను పక్కకునెట్టి వీఐపీ దర్శనాలకు దారులు తీస్తారు. సోమవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు ముక్కంటి ఆలయంలో రెడ్‌కార్పెట్ మర్యాద లభించింది.
– సాక్షి టాస్క్‌ఫోర్స్

● వీఐపీలకే మా సేవ!

● వీఐపీలకే మా సేవ!