
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
ప్రభుత్వానికి మధ్య వారధిగా, ప్రభుత్వాల దుర్నీతి పాలనను ఎత్తి చూపుతూ రాసే కథనాలపై పత్రిక ఎడిటర్, విలేకరులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అనుసరిస్తోంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు పెట్టడం సరికాదు. వైఫల్యాలను, వాస్తవాలను రాస్తున్న సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధతి కాదు. సాక్షి పత్రిక, సిబ్బందిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.
– వి.రెడ్డిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు.