
ఆదుకోవాలని ఆటోకార్మికులు
వాహనమిత్రను కోతలు లేకుండా అందరికీ వర్తింపజేసి ఆదుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ఆటోలతో చేరుకుని ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 13.25లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే కేవలం 2.90 లక్షల మందికి వాహన మిత్ర అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఆటోకార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఉచిత బస్సు నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసినా కూలి డబ్బులు కూడా రావడం లేదని వాపోయారు. 90శాతం ఆటోలను కార్మికులు అద్దెకు తీసుకుని నడుపుతున్నారని, వారికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నేతలు మురళి, బాలసుబ్రమణ్యం, కేతారి రాధాకృష్ణ, జయచంద్ర, ఐఎప్‌టీయు నగర కార్యదర్శి లోకేష్, లక్ష్మయ్య, శివ, చంద్రశేఖర్ రెడ్డి, ఎన్‌డీ రవి మద్దతు తెలిపారు.