
తిరుచానూరు స్టేషన్‌కు తొలి రైలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి–రేణిగుంట మధ్యలో నూతనంగా నిర్మించిన తిరుచానూరు రైల్వేస్టేషన్‌కు తొలి రైలు రానుంది. మంగళవారం సాయంత్రం 4.50 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి బుధవారం ఉదయం 11.30 గంటలకు తిరుచానూరు స్టేషన్‌కు చేరుకోనుంది. అదే రోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుగుప్రయాణం కానుంది. ఈ క్రమంలోనే నాందేడ్ నుంచి ఈ నెల 23, 30వ తేదీల్లో సైతం ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు తిరుచానూరుకు రాకపోకలు సాగించనుంది.
టెర్మినల్‌గా మారుస్తూ ..
తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్‌లపై ప్రయాణికుల ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో తిరుచానూరు రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2021లో పనులు ప్రారంభించారు. అనంతరం స్టేషన్ స్థాయిని పెంచి టెర్మినల్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేబడ్జెట్‌లో సైతం ఈ స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.