
● రుయా.. కటిక నేలే దిక్కయా!
రాయలసీమకే తలమానికమని చెప్పుకునే రుయా ఆస్పత్రిలో రోగులతోపాటు సహాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాసేపు విశ్రమించేందుకు కటిక నేలే శరణ్యంగా మారుతోంది. చికిత్సపొందుతున్న తమ వారిని కనిపెట్టుకుని చూసుకునేందుకు వరండాలే దిక్కవుతున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి
శాంతిభద్రతల రక్షణే లక్ష్యం
తిరుపతి క్రైమ్ : శాంతిభద్రతల రక్షణే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. అలాగే మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. షీటీమ్‌లను బలోపేతం చేస్తామని వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పకడ్బందీ బందోబస్తు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు కల్పించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ లాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పాయింట్ ఆఫ్ వ్యూలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కింగ్‌పై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

● రుయా.. కటిక నేలే దిక్కయా!