
ముక్కంటీ.. కనవేంటి!
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదిదంపతుల దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు. నడవలేని వారిని ఆలయ ముఖ ద్వారం వరకు చేర్చేందుకు నాలుగు గోపురాల వద్ద ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వీల్‌చైర్‌లో స్వామి, అమ్మవార్ల దర్శనానికి తీసుకువెళుతుంటారు. అయితే ఈ బ్యాటరీ వాహనాలను మాత్రం వీఐపీల సేవలకే వినియోగిస్తున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు ఆలయంలోకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని ఆర్భాటంగా ప్రకటించే అధికారులు.. ఆచరణలో పూర్తి విరుద్ధంగా నడుచుకోవడంపై పలువురు మండిపడుతున్నారు.
– తొట్టంబేడు

ముక్కంటీ.. కనవేంటి!