
గవర్నర్‌కు సాదర స్వాగతం
రేణిగుంట : తిరుపతి పర్యటనలో భాగంగా జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఆర్‌డీఓ భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.
నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’ రద్దు
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ను సోమవారం రద్దు చేసినట్లు డీఆర్‌ఓ నరసింహులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జాతీయ మహిళా సాధికార సదస్సు నేపథ్యంలో అధికారులందరూ వివిధ విధుల్లో ఉన్న కారణంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉండదని వివరించారు. అర్జీదారులు కలెక్టరేట్, మండల కార్యాలయాలకు వెళ్లవద్దని సూచించారు. అయితే దీనిపై ముందస్తుగానే ప్రజలకు సమాచారం అందించి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏయూఎన్‌టీఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
తిరుపతి సిటీ : ఏపీ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం ఎంపికై ంది. ఆదివారం అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీలో కార్యవర్గ ఎన్నిక చేపట్టినట్లు ఎన్నికల అధికారి గుర్రంకొండ శ్రీధర్ తెలిపారు. అధ్యక్షుడిగా ఎస్‌కే వర్సిటీకి చెందిన తిమ్మప్ప, జనరల్ సెక్రటరీగా ఎస్వీయూకు చెందిన ఎన్.సుబ్రమణ్యం, మీడియా కో–ఆర్డిరేటర్‌గా ఎస్వీయూకు చెందిన మనోజ్‌కుమార్ ఎన్నికై నట్లు వెల్లడించారు.
తిరుమలలో భద్రతపై స్పెషల్ డ్రైవ్
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్, హెల్త్, శానిటేషన్, పోలీసులు సంయుక్తంగా ఆదివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కల్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి తిరుపతికి పంపించారు. స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు తమ వద్ద పనిచేసే వారికి తిరుపతిలోనే వసతి కల్పించాలని ఆదేశించారు.
పకడ్బందీగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. చైర్మన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠనాథుని ఉత్సవాల్లో భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వాహన సేవలను ప్రతి ఒక్కరూ తిలకించేలా 35 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సీవీఎస్‌ఓ మురళీకృష్ణ, సీఈ సత్య నారాయణ, ఈఈ సుబ్రమణ్యం, డిప్యూటీ ఈఓలు లోకనాథం, రాజేంద్ర కుమార్, సోమన్నారాయణ పాల్గొన్నారు.
డిగ్రీ సీట్ల కేటాయింపు రేపు
తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో పలు కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యామండలి వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను పలు మార్లు వాయిదా వేశారు. ఈ క్రమంలో సోమవారం అధికారికంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపుపై మేసేజ్‌లు పంపనున్నట్లు తెలిపారు. దీంతో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో మంగళవారం రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
కొత్త కార్యవర్గం

గవర్నర్‌కు సాదర స్వాగతం

గవర్నర్‌కు సాదర స్వాగతం

గవర్నర్‌కు సాదర స్వాగతం

గవర్నర్‌కు సాదర స్వాగతం