
17 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు
తిరుపతి తుడా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారీ స్వశక్త్ అభియాన్ కింద మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య రక్షణతోపాటు కుటుంబాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అందులో భాగంగా జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు.