
లోకసభ స్పీకర్‌కు ఘన స్వాగతం
ఏర్పేడు : తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు ఘనస్వాగతం లభించింది. ఆయనకు విమానాశ్రయంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గురజాల జగన్మోహన్, వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరి వెళ్లారు.