
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా!
కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. పత్రికల్లో నిజాలు రాస్తే ఉలిక్కి పడుతోంది. రాసిన వార్తల్లో నిజాలున్నపుడు దాన్ని సవరించుకుని పాలన సాగించాల్సింది పోయి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా! ఇదేనా ప్రజాస్వామ్యం.. ఇదేనా ప్రతికలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే స్వేచ్ఛ..భారత రాజ్యాంగంలో నాలుగో స్థంభంగా ఉన్న పత్రికా వ్యవస్థ కూడా మీ స్వాధీనంలో పని చేయాలా! రాజ్యాంగ వ్యవస్థను కాలరాసే విధంగా ప్రవర్తించడం చూస్తుంటే రాజ్యాంగం మీద వీళ్లకు గౌరవం లేకుండా పోయింది. వీళ్లు రచించుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్నారు. ప్రకృతి సంపదలైన ఇసుక, మట్టి, గ్రావెల్ దందాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లను ప్రశ్నిస్తే దొంగ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వార్తలను రాసిన విలేఖరులపై అక్రమంగా కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. – కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే, సూళ్లూరుపేట