
అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌తో పాటు ఇతర అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజ స్థంభం వద్ద మొక్కుకుని, అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపుల కేంద్ర మంత్రికి, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవేరుల చిత్రపటాన్ని అందజేసి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డితో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.