
పోలేరమ్మ తల్లి హుండీ ఆదాయం రూ. 22,21,350
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్ధానం హుండీ రాబడి రూ. 22,21,350 రాబడి వచ్చినట్లు ఈఓ వెంకట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ.. గతనెల 19వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు సంబంధించి 25 రోజులకు సంబంఽధించి అమ్మవారి హుండీ శుక్రవారం నిర్వహించామన్నారు. ఇందులో రూ.22,21,350 నగదు, యూఎస్ డాలర్లు 5, బంగారం 1,852 గ్రాములు, వెండి 37 గ్రాములు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ సుధీర్, జాతర సేవా కమిటీ సభ్యులు , బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
డీఎఫ్‌ఓల బదిలీ
తిరుపతి మంగళం: తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్వో జీ.శ్రీనివాసులు సత్యసాయి జిల్లా డీఎఫ్‌ఓగా బదిలీ అయ్యారు. అలాగే తిరుపతిలో ఖాళీగా ఉన్న డీఎఫ్‌ఓ స్థానంలోకి జిన్.పవన్‌కుమార్ రావును నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.