
మస్టర్ల మాయాజాలంపై విచారణ
డక్కిలి : స్థానిక పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి పథకం పనుల్లో గోల్‌మాల్ వ్యవహారంపై శుక్రవారం స్థానిక సచివాలయంలో క్లస్టర్ ఏపీడీ వరప్రసాద్ విచారణ చేపట్టారు. ఈనెల 9వ తేదీన శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో శ్రీమస్టర్లలో మాయాజాలంశ్రీ అనే శీర్షికతో ప్రచురితమైంది. దీంతో డ్వామా పీడీ ఆదేశాలు మేరకు శుక్రవారం ఏపీడీ ఉపాధిహామీ పథకం సిబ్బందితో విచారణ చేపట్టారు. అంతే గాక స్థానికంగా అందుబాటులో ఉన్న మస్టర్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ విలేకర్లతో మాట్లాడుతూ.. డక్కిలిలో ఈనెల 4వ తేదీన 8 మంది కూలీలకు తప్పుడు మస్టర్లుగా వేసినట్లు గుర్తించామన్నారు. ఆ కూలీలు పనులకు హాజరు కాకపోయినా వారి ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు వెల్లడైందన్నారు. ఈ విచారణ నివేదికను కలెక్టర్, డ్వామా పీడీకి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ అనురాధ, ఏపీఓ కుమారస్వామి, టీఏ గిరి ఉన్నారు. డక్కిలి ఉపాధి మేట్ అవినీతి అక్రమాల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డక్కిలి గ్రామ వైఎస్సార్‌సీపీ నేత మాదిరెడ్డి మునిరామ్‌రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డక్కిలి గ్రామానికి ఉపాధి హామీ మేట్ రూ. 2లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. అయితే శుక్రవారం ఏపీడీ విచారణ జరిపి 8 మంది మాత్రమే కూలీ పనులకు రాని వారని మస్టర్లులో ఎక్కించినట్లు తెలిపారన్నారు. వాస్తవానికి 20 మందికి పైగా కూలీలు ఎన్నో రోజులు నుంచి మస్టర్లు ఎక్కించుకుని ఉపాధి నిధులను బొక్కేశారని తెలిపారు.

మస్టర్ల మాయాజాలంపై విచారణ