
పదహారేళ్లు..
సత్యవేడులో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, ఒక తమిళ మీడియం స్కూలు ఏర్పాటు చేశారు. ఉబ్బలమడుగు, భూవతేశ్వరకోన, రాళ్లవాగు నీటి ప్రాజెక్టులను చేపట్టారు. రూ.5.50 కోట్లతో భూపతేశ్వరకోన ప్రాజెక్టు, రూ.19 కోట్లతో ఉబ్బలమడుగు ప్రాజెక్టు నిర్మించారు. తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి చెరువులకు నీటిని నింపేందుకు రూ.100 కోట్లతో ఉపకాలువలు నిర్మించారు.
ఫీజురీయింబర్స్‌మెంట్‌కు
శ్రీకారం చుట్టిన మహనీయుడు
ఆరోగ్యశ్రీతో పేదలకు రక్షణ కల్పించిన ఆపద్బాంధవుడు
జలయజ్ఞం చేపట్టిన దార్శనికుడు
నేడు దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
సోమశిల–స్వర్ణముఖి కాలువకు 2009లో శ్రీకారం చుట్టారు. వెంకటగిరి నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. మరో 10 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో 30 వేల ఎకరాల సాగు నీరు అందించేలా ప్రాజెక్టుకు లక్ష్యాలను నిర్దేశించారు.
నాటి ఉమ్మడి జిల్లాలోని మదనపల్లెలో మూతపడిన విజయాడెయిరీని 2008లో పునఃప్రారంభించారు. 5వేల లీటర్లతో ప్రారంభమైన డెయిరీని 70వేల లీటర్ల స్థాయికి పెంచారు. వ
తిరుపతిలో ప్రధాన కూడళ్లను ఏర్పాటు చేసి మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీకృష్ణదేవరాయలు, శంకరంబాడి, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాల స్థాపనకు శ్రీకారం చుట్టారు.తిరుపతి ముఖద్వారంలో పూర్ణకుంభం ఏర్పాటు చేశారు. అలాగే తెలుగుతల్లి విగ్రహం నెలకొల్పారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సైతం ఆయన హయాంలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో దేశ, విదేశాలకు చెందిన 2వేల మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు,
జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 2006లో శ్రీసిటీ సెజ్‌కు అనుమతులు మంజూరు చేశారు. 2008లో 8 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వందలాది పరిశ్రమలతో శ్రీసిటీ రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. సుమారు రూ.60వేలకు పైగా పెట్టుబడులతో 27 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏర్పడ్డాయి.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను తరలించి సాగు, తాగునీరు అందించేందుకు 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 70శాతం పనులు పూర్తి చేశారు.
నగరి నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి చర్య లు చేపట్టారు. రసాయన నీటిని శుభ్రపరిచే కామన్ ఈటీపీ ప్లాంటు ఏర్పాటుకు అనుమతులతోపాటు రూ. 14 కోట్లు మంజూరు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే రోజా ప్లాంటు ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకువచ్చారు.
నగరిలో రూ.15 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పాలకులు ఆ ఆస్పత్రిని 60 పడకలకే పరిమితం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద రూ.5కోట్లతో అభివృద్ధి చేశారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ వారు అదనపు పడకలు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని వితరణగా అందించారు.
నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ శివారులో రూ.36 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారు. తదనంతర కాలంలో గాలేరు నగరి ప్రాజెక్టును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఆ ట్యాంక్ ద్వారానే నగరి ప్రజల దాహార్తి తీరుతోంది.
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రారంభించారు. 2004 నుంచి 2008 వరకు ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్ చేశారు.
వ్యవసాయం దండగని చంద్రబాబు అంటే.. కాదు వ్యవసాయం పండగని వైఎస్సార్ నిరూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 6.40 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలకు సంబంధించి వారి కుటుంబాలకు తక్షణం ఆర్థిక సాయం చేశారు.
చంద్రబాబు హయాంలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలకు రూ.50 కోట్లు కేటాయించి పునఃప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో 3.15 లక్షల మందికి గూడు కల్పించారు. శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్ కాలనీ ఏర్పాటు చేసి 11వేల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు.
పేదల దేవుడు నువ్వు
అభాగ్యుల ఆరాధ్యదైవం నువ్వు
జల ప్రదాతవి నువ్వు
ఆరోగ్య రక్షకుడివి నువ్వు
చదువుల రేడువి నువ్వు
సంక్షేమ సారధివి నువ్వు
నవ సంకల్పానికి నాందివి నువ్వు
జవసత్వానికి పునాదివి నువ్వు
మమ్మేలిన ‘మహా నేతవి’ నువ్వు
16 ఏళ్ల నీ జ్ఞాపకాలు.. అభివృద్ధికి చెరగని సంతకాలు
నిన్ను ఎలా మరిచేది రాజన్నా.. అంటూ జిల్లా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను స్మరించుకుంటున్నారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన రైతుబాంధవుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : మనసున్నవాడు పాలన సాగిస్తే ఎంత జనరంజకంగా ఉంటుందో.. ప్రజలను ఓటర్లుగా కాకుండా తన వాళ్లుగా చూసే నాయకుడు గద్దెనెక్కితే రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందో దేశానికి చాటి చెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువారి గుండెల్లో సంక్షేమ సంతకం చేసి చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారు. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం.
రాజన్నా.. రచ్చబండే సాక్షి
చిత్తూరు అర్బన్: ‘రచ్చబండ సాక్షిగా నిను మరువలేం రాజన్నా.. అంటూ అనుప్పల్లె గ్రామస్తులతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు నేటికీ కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. నీ జ్ఞాపకాలు తలుచుకుని.. తీపి గురుతులు నెమరువు వేసుకుని ఆవేదనకు లోనవుతూనే ఉన్నారు. 2009, సెప్టెంబరు 2న సీఎం స్థాయి వ్యక్తి నేరుగా ప్రజలను కలిసి, వ్యక్తిగత–మౌలిక అవసరాలు గుర్తించి తెలుసుకుని.. వాటి పరిష్కరించే వినూత్న కార్యక్రమానికి నడుంబిగించారు. చిత్తూరులో చేపట్టిన ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే .. రాష్ట్ర మొత్తం అమలు చేయాలని రాజశేఖరరెడ్డి ఆలోచన. ముఖ్యమంత్రి హోదాలో రచ్చబండకు వస్తున్న వైఎస్.రాజశేఖర రెడ్డికి స్వాగతం పలికేందుకు కట్టమంచిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ అందరూ నిరీక్షిస్తున్నారు. సమయం ఉదయం 9.30 గంటలైనా చాపర్ చేరుకోలేదు. పదయినా ఆచూకీ రాలేదు. సమయం దాటుతున్న కొద్దీ సామాన్యుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. రాజన్న అచూకీ లేదనే విషయం ఆలస్యంగా గుర్తించారు. ప్రత్యేకించి ఆ రోజు అనుప్పల్లె గ్రామమంతా వైఎస్సార్ గురించి ఏదైనా తెలుస్తుందేమోనని టీవీలకు అతుక్కుపోయారు. తీరా మరుసటి రోజున చాపర్ పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురై రాజన్న కన్నుమూశారన్న విషాద వార్తను వినాల్సి వచ్చింది. రాజన్న కూర్చుంటారని ఆశించి భంగపడ్డ రచ్చబండ మూగబోయింది. ఊరు ఊరంతా ఆ మహనీయుడి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అనుప్పల్లె రావిచెట్టు కిందున్న రచ్చబండ వైఎస్సార్‌ను స్పర్శించలేకపో యానని మథనపడుతూనే ఉంది. రాజన్న వర్ధంతికి ఒకరోజు ముందుగానే గ్రామస్తులు రచ్చబండ వద్దకు చేరుకుని కుమిలిపోవడం కనిపించింది.

పదహారేళ్లు..

పదహారేళ్లు..