
ఎన్నిసార్లు తిరగాలో..
నాకు 70 ఏళ్ల. సరిగా నడవలేను. గుండెకు ఆపరేషన్ కూడా అయ్యింది. నాకు వంశపారంపర్యంగా వికృతమాలలోని సర్వే నంబర్ 182/1లో 88 సెంట్ల భూమి ఉంది. నా ప్రమేయం లేకుండా కొంతమంది పంచాయతీ తీర్మానం చేయించి రాస్ సేవా సమితికి అప్పగించేశారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కింద కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చా. ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు 9 పర్యాయాలు వినతులు సమర్పించా. సమస్య పరిష్కరించినట్లు మాత్రం మెసేజ్ వచ్చింది. అయితే నా భూమి మాత్రం దక్కలేదు. ఇంకా ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలో తెలియడం లేదు. – ప్రకాష్,
పాపానాయుడుపేట, ఏర్పేడు మండలం