
క్వారీకి అనుమతులు ఇవ్వొద్దని వినతి
తొట్టంబేడు : తొట్టంబేడు సమీపంలో ఎంఎస్‌ఆర్ క్రషర్స్ వారి క్వారీకి అనుమతులు మంజూరు చేయవద్దని స్థానికులు కోరారు. సోమవారం బీడీకాలనీ, జగనన్న కాలనీ, న్యూసన్‌రైజ్ సిటీ లేఅవుట్‌లోని 75 ప్లాట్ల యజమానులు ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం తమ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి శుద్ధి కేంద్రం, కొత్తగా నిర్మి స్తున్న గిరిజన సంక్షేమ వసతిగృహం ఉన్నాయన్నారు. పదేళ్ల క్రితం క్వారీ మూతపడిందని, ఇప్పుడు మళ్లీ క్రషర్స్ నిర్వాహకులు ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆందోళ న వ్యక్తం చేశారు. అయితే ఎన్‌ఓసీని జారీ చేయవద్దని కోరారు.