
సర్వర్ పని చేయక పింఛను లబ్ధిదారుల ఇక్కట్లు
చిల్లకూరు: గూడూరు నియోజకవర్గంలో సచివాలయ, మండల పరిషత్ సిబ్బంది సోమవారం పింఛను పంపిణీ కోసం ఆయా గ్రామాలకు వెళ్లారు. ఉదయం 11 గంటల వరకు సర్వర్ పనిచేయక పోవడంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని పడిగాపులు పడాల్సి వచ్చింది. ఒక లబ్ధిదారునికి పింఛను ఇచ్చేందుకు 45 నిమిషాలు పట్టడంతో మిగిలిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూడూరులోని కోనేటి మిట్ట, వాముల మిట్టలలోని లబ్ధిదారులు ఒక చోటకు రావడంతో సచివాలయ సిబ్బందిని చుట్టు ముట్టి పింఛను తొందరగా పంపిణీ చేయాలని వేడుకోవడం కనిపించింది.