
పొదుపు మహిళల ఆవేదన
పొదుపు డబ్బులను మెప్మాలోని కొందరు రిసోర్స్ పర్సన్‌లు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని సంజీవ్‌గాంధీ కాలనీకి చెందిన ఆర్‌పీ నౌహీరా రూ.70 లక్షలు పొదుపు నగదును స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు మొరపెట్టుకున్నారు.
పింఛన్ కోసం
నేను దివ్యాంగురాలిని. గతంలో నాకు వైకల్యం 88శాతంగా నమోదు చేశారు. రీవెరిఫికేషన్‌లో 85శాతం చేశారు. అలాగే నా కుమారుడు దేదీప్ కూడా దివ్యాంగుడు. గతంలో 100శాతం వైకల్యం ఇచ్చారు. రీవెరిఫికేషన్‌లో 90శాతంగా తగ్గించారు. మేము రూ.15వేల పింఛన్‌కు అర్హులం. అయితే మాకు రూ.6వేలే వస్తున్నాయి. మాకు న్యాయం చేయండి.
– లక్ష్మిప్రియ, దేదీప్, తిమ్మినాయుడుపాళెం, తిరుపతి

పొదుపు మహిళల ఆవేదన