
సముద్రపు నాచుతో జీవనోపాధి
వాకాడు : సముద్రపు నాచు మొక్కల పెంపకంతో మత్స్యకారులు ప్రత్యామ్నాయ జీవనోపాధి పొందవచ్చని గ్లోబల్ కై ్లమెట్ ఫండ్ టీమ్ లీడర్ రఫీ తెలిపారు. సోమవారం ఈ మేరకు వాకాడు మండలం కొండూరుపాళెం, అంజలాపురం బీచ్‌లను సందర్శించారు. సముద్ర నాచు మొక్కల పెంపకానికి అనుకూల ప్రాంతాలుగా గుర్తించారు. సముద్రపు అంతర్భాగంలో నాచు వృద్ధి చెందితే వివిధ జీవరాశులకు ఆవాసంగా మారుతుందని, భూమి వేడెక్కకుండా నివారించి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతుందని వివరించారు. సముద్ర నాచు పెంపకం కింద 50 యూనిట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ పథకానికి మహిళా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు.