తిరుపతి లీగల్ : ఎర్రచందనం కేసులో తమిళనాడుకు చెందిన కె.అన్బుకు ఐదేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ఎరచ్రందనం కేసుల న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. 2016 డిసెంబర్ 8వ తేదీ శేషాచలం అటవీ ప్రాంతంలో ఎరచ్రందనం దుంగలను తరలిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
రోడ్డు ప్రమాదంలో టీటీడీ ఉద్యోగి మృతి
ఏర్పేడు : మండలంలోని వికృతమాల వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మడిబాక పంచాయతీ రాజుల కండ్రికకు చెందిన పి.మునీంద్ర బాబు (59) మృతి చెందాడు . ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి కథనం మేరకు.. టీటీడీలో పనిచేస్తున్న మునీంద్రబాబు ద్విచక్రవాహనంపై వెళుతుండగా పంది అడ్డురావడంతో అదుపు తప్పి పడిపోయి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.