
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కోట:మండలంలోని తిమ్మనాయుడుపాళెంలో సోమవారం విద్యుదాఘాతంతో వరికోత మిషన్ ఆపరేటర్ మృతి చెందాడు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా గుడుగులదిన్నె గ్రామానికి చెందిన రవి(23) వరికోత మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తిమ్మనాయుడుపాళెం వద్ద పంట కోసేందుకు వెళుతుండగా మిషన్‌కు విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సర్వేయర్‌కు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహించే భవనం పెచ్చులూడుతోంది. సోమవారం ఓ గదిలో పెచ్చులూడి పడడంతో సర్వేయర్ కుర్చీ విరిగిపోయింది. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ గోపీనాథ్‌రెడ్డి అక్కడకు చేరుకుని సర్వేయర్ గదిని పరిశీలించారు. ఆ గదికి తాళం వేసేసి మరోచోట కూర్చోవాలని సర్వేయర్‌ను ఆదేశించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి