
జిల్లా అధికారులతో సమీక్షలు
తిరుపతి అర్బన్: జిల్లా అధికారులతో రాష్ట్ర స్థా యి అధికారులు గురువారం పలు అంశాలపై వ ర్చువల్ పద్ధతిలో సమీక్షించారు. తిరుపతి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొన్నారు. ప్రధానంగా ఏపీఐఐసీకి చెందిన సమస్యలపై చర్చించారు. అలాగే స్వర్ణాంధ్ర, పీ–4, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన, ప్రధాన ప్రాజెక్టులు, భూ సమస్యలు, జిల్లా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు, అన్నదాత సుఖీభవ, యూరియా కొరత తదితర అంశాలపై చర్చించారు. జిల్లా పరిస్థితులను కలెక్టర్, జేసీ వారికి వివరించారు.అడ్మిషన్ల సమయం మరింత పెంచాలని, సర్టిఫికెట్లు ఇప్పటికీ కొందరికి అందలేదని సమన్వయకర్తలు అధికారులకు విన్నవించారు. రాష్ట్ర ఓపెన్ స్కూల్స్ సొసైటీ సమన్వయకర్త నరసింహారావు, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ గురుస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘నవోదయ’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9, 11వ తరగతులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపా రు. 9వ తరగతిలో ప్రవేశాల కోసం ఏదేని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివి 2011 మే 1వ తేదీ, 2013 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలియజేశారు. అలాగే 11వ తరగతిలో ప్రవేశాల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివి 2009 జూన్ 1వ తేదీ, 2011 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత రలిగిన విద్యార్థులు నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 23వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న నిర్వహించనున్నట్లు తెలియజేశారు.