
అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం
నాయుడుపేట టౌన్ : పట్టణంలోని ఏఎల్‌సీఎం ఆటస్థలం ఆవరణలో శనివారం నుంచి రెండు రోజుల పాటు అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ముందుగా ఎస్‌ఏఎల్‌సీ మాజీ బిషప్ మైఖెల్ బెన్‌హర్‌తో పాటు ఫుట్‌బాల్ జిల్లా సంబంధిత అధికారులు ప్రారంభించారు. ఈ పోటీలలో తిరుపతి, నెల్లూరు,వె వైఎస్సార్ కడప తదితర జిల్లాలకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారిణులు పాల్గొంటున్నట్లు కోచ్ గౌస్‌బాషా తెలిపారు. ఈ పోటీలను నాయుడుపేట ఫుట్‌బాల్ క్లబ్ సారథ్యంలో జిల్లా అధికారులతో కలిసి పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, క్లబ్‌కు చెందిన భావన్ అనుదీప్, సభ్యులు పాల్గొన్నారు.
నవోదయ ఫలితాల్లో ‘విశ్వం’ ప్రతిభ
తిరుపతి సిటీ : జాతీయ స్థాయిలో 2025–2026 విద్యా సంవత్సరానికి జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ 3వ జాబితా ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 69 మంది విశ్వం విద్యార్థులు సీట్లు సాధించారని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఆయన అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ ఎన్ తులసీ విశ్వనాథ్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోందన్నారు.2026 నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల కోసం 8688888802 / 9399976999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం