కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు

Jul 8 2025 4:23 AM | Updated on Jul 8 2025 4:23 AM

కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు

కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు

● త్వరలో పట్టాలపైకి తిరుపతి–చిక్‌మంగళూరు ఎక్స్‌ప్రెస్‌

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని ప్రజల సౌకర్యార్థం కొత్తగా వీక్లి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కనుంది. ప్రధానంగా బెంగళూరు, చిక్‌మంగళూరు, తుంకూరు ప్రాంతాల వారికి ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది. తాజాగా కేంద్ర రైల్వేశాఖ తిరుపతి– చిక్‌మంగళూరు మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు గురువారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది. చిక్‌ మంగళూరు నుంచి శుక్రవారం బయలుదేరి తిరుపతి చేరుకుంటుంది. అధికారికంగా ఈ రైలు నెంబర్లు 17423–17424గా నిర్ణయించారు. రైలు ప్రారంభం, షెడ్యూల్‌, టైమింగ్స్‌ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు రైల్వేశాఖ అధికార వర్గాల సమాచారం. ఈ రైలు మొదటి విడతగా వారానికోసారి నడుపనుంది. తరువాత ప్రజల స్పందన మేరకు వారంలో మూడు సార్లు నడిపే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ తెలిపింది.

ప్రయాణికులకు అనుకూలం

ఈ రైలు ప్రయాణించే మార్గంలో ముఖ్యమైన ప్రాంతా లు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, వైట్‌ఫీల్డ్‌, కృష్ణరాజపురం, బెంగళూరు ఎస్‌ఎంవీబీ, తుంకూరు, తిప్తూరు, అరిసికెరె, బిరూర్‌, కదూర్‌, బిసలె హళ్లి, శంకరాయ పట్న స్లేషన్లు ఉంటాయి. ఈ ప్రాంతాల ప్రజలకు ఈ రైలు సౌకర్యవంతంగా మారనుంది. ఈ రైలుకు పాకాల స్టేషన్‌ స్టాపింగ్‌ ఇవ్వడం మరో విశేషం. చిత్తూరు, కుప్పం, బంగారుపేట ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement