
అర్జీలకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఆయనతోపాటు కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 284 అర్జీలు వచ్చాయి. అందులో రెవన్యూ సమస్యలపై 149 అర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
● మదనపల్లిలో బుద్ద భగవాన్ విగ్రహ తలను నరికిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని భారతీయ అంబేడ్కర్ సేన రాష్ట్ర నేతలు పాలకుంట శ్రీనివాసులు, మల్లారపు వాసు డిమాండ్ చేశారు. ఆ మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్‌కు వినతిపత్రాన్ని అందించారు.
● వెంకటగిరి మండలం బుసపాళెం ఎస్టీకాలనీకి చెందిన పలువురు యానాదులు తమ శ్మశానాన్ని కబ్జా చేశారని, కాపాడాలని మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్‌లో అధికారులను కలసి వారికి వినతిపత్రాన్ని అందించారు. ఇప్పటికే పలు సార్లు స్థానిక అధికారులకు అర్జీలు ఇచ్చామని, ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చామని తెలియజేశారు.

అర్జీలకు పరిష్కారం చూపండి