
చిల్లకూరులో రొట్టెల పండుగ
చిల్లకూరు : నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు అనుబంధంగా చిల్లకూరులో ఒక్క రోజు నిర్వహించే రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. నెల్లూరుకు వెళ్లలేని భక్తులు చిల్లకూరులోని దోషాహీద్ దర్గా వద్దకు వచ్చి తమ మొక్కబడులును తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చిల్లకూరులోని సయ్యద్ అహ్మద్‌షా, సయ్యద్ మహ్మద్‌షాలకు చెందిన దో షాహీద్ దర్గాలో రొట్టెలు వదలడం, తిరిగి పట్టుకోవడం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. గూడూరు డివిజన్‌లోని పలు గ్రామాలకు చెందిన ముస్లింలు, హిందువులు ఇక్కడ రొట్టెలు మార్చుకోవడం విశేషం. దీంతో ఆరోగ్య ,కళ్యాణ రొట్టెను పట్టుకునేందుకు డిమాండ్ ఏర్పడింది.