
తిరిగి రాని లోకాలకు!
తిరువణ్ణామలై వెళ్లి వస్తూ..
● ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ ప్రమాదం ● పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు ● ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి ● మరో మహిళ పరిస్థితి విషమం
చంద్రగిరి : తిరువణ్ణామలైలోని అరుణాచల శివయ్యను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ ముందు వెళ్తున్న పాల ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా.. మరో మహిళ తీవ్ర గాయాలపాలైన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి తొండవాడ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడ అర్బన్, చిట్టినగర్‌కు చెందిన కోటేశ్వరరావు, భార్య పద్మావతి, కుమారుడు జశ్వంత్ సాయి, చెల్లెలు హేమలతతో కలసి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కారులో వెళ్లారు. స్వామి దర్శనం ముగించుకుని మంగళవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తొండవాడ సమీపంలో వెళ్తున్న క్రమంలో ముందు కారు నడుపుతున్న కోటేశ్వరరావు ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న పాల ట్యాంకర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జనుజ్జు అయింది. అనంతరం కారులో ప్రయాణిస్తున్న పద్మావతి (38) అక్కడికక్కడే మృతి చెందగా.. కోటేశ్వర రావు, కుమారుడు జశ్వంత్ సాయి (21), చెల్లెలు హేమలత తీవ్రంగా గాయపడ్డారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు మృతి
ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సను అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఆసుపత్రికి చేరుకోగానే వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అప్పటికే కోటేశ్వరరావు కుమారుడు జశ్వంత్ సాయి మృతి చెందినట్లు తెలిపారు. హేమలత పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా డ్రైవింగ్ చేస్తున్న తండ్రి కోటేశ్వర రావుకు ప్రమాద సమయంలో కారులోని బెలూన్‌లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరిగి రాని లోకాలకు!

తిరిగి రాని లోకాలకు!

తిరిగి రాని లోకాలకు!

తిరిగి రాని లోకాలకు!