కక్షగట్టి చంద్రబాబు వేధింపులు | - | Sakshi
Sakshi News home page

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు

Jul 21 2025 6:05 AM | Updated on Jul 21 2025 6:05 AM

కక్షగ

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు

● పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా కుట్రలు ● సొంత నియోజకవర్గంలో సైతం తిరగనివ్వకుండా దాడులు ● ముందుగా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దగ్ధం పేరుతో నాటకాలు ● తర్వాత ప్రభుత్వ, అటవీభూముల ఆక్రమణ అంటూ ఆరోపణలు ● చివరకు తప్పుడు కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి వికటాట్టహాసాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్‌ పాలిటిక్స్‌ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారు.

ఎంపీ మిథున్‌రెడ్డి కారును దహనం చేసిన దృశ్యం (ఫైల్‌)

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.

● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్‌ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.

● రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్‌ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.

● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.

● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్‌ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.

● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్‌ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.

తప్పుడు కేసులో..

తాజాగా లిక్కర్‌ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు 
1
1/3

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు 
2
2/3

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు 
3
3/3

కక్షగట్టి చంద్రబాబు వేధింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement