
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు దుర్మార్గం
గూడూరురూరల్ : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని గూడూరు జెడ్పీటీసీ ఊటుకూరు యామిని , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టుకూరు మహేంద్రరెడ్డి తీవ్రంగా ఖండించారు. గూడూరు మండల నెలటూరులోని ఆదివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం సబబు కాదన్నారు. ఇకనైనా అక్రమ కేసులకు స్వస్తి పలికి ప్రజల బాగోగులు చూసేలా అడుగులు వేయాలని హితువు పలికారు. అనంతరం అక్రమ అరెస్టుకు నిరసనగా కరపత్రాలను ప్రదర్శించారు. సమావేశంలో మెడనూలు రవీంద్రరెడ్డి, పాలెపు గోపాలయ్య, పెరికల శీనయ్య, నన్నూరు రాజశేఖర్ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో నేడు గ్రీవెన్స్
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. వివిధ సమస్యలపై అర్జీదారులు అధికారులకు తమ సమస్యలను వెల్లడించడానికి వీలుంటుంది. కలెక్టర్ వెంకటేశ్వర్‌తో పాటు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అందుబాటులో ఉండనున్నారు.
తెలుగు గెస్ట్ ఫ్యాకల్టీకి
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: తిరుపతి జూపార్క్ రోడ్డులోని ఉదయమాణిక్యం మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలుగు(టీజీటీ) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్ట్‌కు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.రేష్మ తెలిపారు. ఈ నెల 23వ తేదీలోపు జూపార్క్ రోడ్డు టాటా క్యాన్సర్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏంఏ (తెలుగు), బీఈడీ కలిగి ఉండాలని, మరిన్ని వివరాలకు 9000783185ను సంప్రదించాలని ఆమె తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,011 మంది స్వామివారిని దర్శించుకోగా 33,328 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.