
బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు
కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. – భరత్, ఎమ్మెల్సీ, కుప్పం
మిథున్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అక్ర మ అరెస్టు అప్రజాస్వామికం. కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని చూసి చంద్రబాబుకు వణుకుపుడుతోంది. అందులో భాగంగానే అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంపీని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను రాష్ట్ర ప్రజలే తిప్పి కొడతారు.
– కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్
కక్షగట్టి.. అరెస్ట్ చేసి
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబా బు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మ ద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసు లను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు. –విజయానందరెడ్డి,
సమన్వయకర్త చిత్తూరు నియోజకవర్గం
లోకేష్ నీకు చిప్పకూడే గతి
కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.
– వీ.హరిప్రసాద్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి
కక్ష సాధింపులకు పరాకాష్ట
లిక్కర్ స్కామ్ పేరుతో తప్పుడు కేసు పెట్టి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరె స్ట్ చేయడం కూటమి ప్రభు త్వ కక్ష సాధింపులకు పరాకాష్ట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి కుట్రపూరిత చర్యలతో వైఎస్సార్‌సీపీని దెబ్బతీయలేరు. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పోరాడుతుంది. ఎంపీ మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
– బీరేంద్రవర్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు

బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు

బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు

బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు