
టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల: తిరుమలలో సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణి, బంగారు డాలర్ల విక్రయ కౌంటర్, అగరబత్తి, కొబ్బరికాయలు విక్రయ కౌంటర్లు, పబ్లికేషన్ స్టాళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లడ్డూ కౌంటర్, పబ్లికేషన్ స్టాళ్లు, బంగారు డాలర్ల విక్రయ కేంద్రంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్‌ను ఆయన పరిశీలించారు. కొబ్బరికాయల కౌంటర్ వద్ద డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.