
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్
తిరుమల: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్‌కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ చైర్మన్ లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అంతకు ముందు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుపతిలో సైకో వీరంగం
● కర్రతో ముగ్గురిపై దాడి ● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్‌ఐ లోకేశ్ వివరాల మేరకు.. కపిలతీర్థం రోడ్డులో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై దాడి చేశారు. అక్కడున్న యాచకుడు శేఖర్ (55), వాహనాల పార్కింగ్‌లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
వల వేసి.. బంధించి
అంతటితో ఆగని సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు. రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్‌ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వల వేసి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద కత్తి కూడా ఉందని, అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్