
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
నాయుడుపేటటౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్వర్ణముఖి సమీప గ్రామాలైన అయ్యప్పరెడ్డిపాళెం, మూర్తిరెడ్డిపాళెం, కల్లిపేడు, పండ్లూరు, అన్న మేడు, చిగురుపాడు, తిమ్మాజి కండ్రిగ, తుమ్మూరు , మర్లపల్లి, కాలవ గట్టు, వేమగుంటపాళెంలో ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. దీన్ని ఎక్కడికక్కడ అరికట్టలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. స్వర్ణముఖి నది కాజ్‌వే వద్ద గేట్లు తీసివేడయడంతో ఇసుక రాత్రి పగలు తేడాలేకుండా తరలిపోతోంది. అధికారులకు నెలవారీ ముడుపులు అందుతుండడంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.