
వాటర్ ప్లాంట్‌పై దాడి
పాకాల : స్థానిక శివశక్తి నగర్‌లోని హేమాద్రి మినరల్ వాటర్ ప్లాంట్‌పై దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు యోగిత కథనం మేరకు బ్యాంకు రుణం పొంది శివశక్తి నగర్‌లో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఇది గిట్టని పక్కింటి వారు రోజూ ఆమెతో గొడవ పడుతున్నారు. ఉదయం వాటర్‌ప్లాంట్‌పై రాళ్లతో దాడి చేశారు. ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టారు. కొళాయిలను విరగ్గొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యోగిత స్కూటీపై బయల్దేరింది. దీంతో ఆమెను పక్కను నెట్టేసి, స్కూటర్‌ని కింద పడేసి ధ్వంసం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వాటర్ ప్లాంట్‌పై దాడి